గేట్‌కు దరఖాస్తు చేస్తున్నారా? గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)కు దరఖాస్తుల ప్రక్రియ ఆరంభమైంది!! ఐఐటీలతోపాటు ఐఐఎస్సీ- బెంగళూరు, ఎన్ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇంజినీరింగ్/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్/ ఫార్మసీ విభాగాల్లో చేరడానికి గేట్ స్కోరు తప్పనిసరి. కొన్ని పబ్లిక్, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాలకు ఈ స్కోరు ప్రామాణికం. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, ఉన్నత విద్యాశాఖల తరపున ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్- బెంగళూరు, 7 ఐఐటీల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే పరీక్ష గేట్. ఈసారి ఈ పరీక్షను ఐఐటీ రూర్కీ నిర్వహిస్తోంది. బీఎస్ఎన్ఎల్ (జేటీఓ) నియామకాలకు గేట్ స్కోరును ఆధారంగా తీసుకోనున్నారనే వార్తలు వినబడుతున్నాయి.
గ్రూప్-ఎ స్థాయి పోస్టులు అయిన సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ ఎస్ఎఫ్ఓ (టెలీ), సీనియర్ రిసర్చ్ ఆఫీసర్ ఎస్ఆర్ఓ (క్రిప్టో), ఎస్ఆర్ఓ (ఎస్ అండ్ టీ) నియామకాలకు కూడా గేట్ స్కోరును ఆధారంగా తీసుకుంటున్నారు. గేట్-2017 పరీక్షను మనదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా నిర్వహిస్తున్నారు. అవి- బంగ్లాదేశ్, ఇథియోపియా, నేపాల్, సింగపూర్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 23 బ్రాంచీల అభ్యర్థులకు ఆన్లైన్లో పరీక్షను నిర్వహిస్తారు.
గేట్ ప్రశ్నపత్రం స్థాయి ఐఐటీల పేరు ప్రతిష్ఠలకు అనుగుణంగానే ఉంటుంది. అందువల్ల దీన్ని రాయదలచుకున్న ప్రతి ఇంజినీరింగ్ సైన్స్ విద్యార్థీ ప్రణాళికబద్ధంగా శ్రమించాల్సిందే. పరీక్ష రుసుము: * స్త్రీలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారికి రూ.750, పురుషులకు (జనరల్, ఓబీసీ) రూ. 1500.
విదేశాల్లో ఈ పరీక్షను రాయడానికి 50 యూఎస్ డాలర్లు కట్టాలి. రుసుమును నెట్ బ్యాంకింగ్/ డెబిట్ కార్డు/ ఈ- చలానా ద్వారా ఆన్లైన్లో చెల్లించాలి. పరీక్ష రుసుమును తిరిగి ఇవ్వరు. విద్యార్హతలు: * గత ఏడాది మాదిరిగానే ఈసారి నిర్వహించబోయే గేట్‌కు కూడా ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదివే, పూర్తయిన విద్యార్థులు అర్హులు.
ఇంజినీరింగ్‌లో మూడో ఏడాది విద్యార్థులు అనర్హులు. * బీఈ (4 సం.ల కోర్సు)/ బీటెక్ (4 సంవత్సరాల కోర్సు)/ బీఆర్క్ (5 సం.) చివరి సంవత్సరం చదివే విద్యార్థులు, ఇంజినీరింగ్ పూర్తయిన విద్యార్థులు అర్హులు. * బీఎస్ (4సం. కోర్సు) చివరి సంవత్సరం చదివే విద్యార్థులు, పూర్తయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఎంఎస్సీ/ ఎంసీఏ/ తత్సమాన కోర్సు చివరి సంవత్సరం, కోర్సు పూర్తయినవారు అర్హులు. * ఎం.ఈ/ఎంటెక్ (పోస్ట్ బీఎస్సీ) రెండో, మూడో, నాలుగో సంవత్సరం, కోర్సు పూర్తయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. * ఇంటిగ్రేటెడ్ ఎంఈ/ ఎంటెక్/ డ్యూయల్ డిగ్రీ (డిప్లొమా తరువాత/ 10+2) నాలుగు, ఐదు సంవత్సరాలు చదువుతున్న, కోర్సు పూర్తయినవారు అర్హులు. * ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ (4 సం.)/ ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ (5 సం.) చివరి సంవత్సరం చదివే విద్యార్థులు, పూర్తయినవారు పరీక్ష రాయటానికి అర్హులు.
* ఇంజినీరింగ్ పూర్తయినవారు డిగ్రీ సర్టిఫికెట్/ ప్రొవిజినల్ సర్టిఫికెట్తో దరఖాస్తు చేయాలి. కోర్సు చదువుతున్న విద్యార్థులకు ప్రిన్సిపల్ నుంచి పొందిన అనుమతి పత్రం సరిపోతుంది. పరీక్ష విధానం: * ఆన్లైన్ పరీక్ష విధానంలో కంప్యూటర్ మౌస్‌ను ఉపయోగించి సరైన ఆప్షన్‌ను గుర్తించాలి. * న్యూమరికల్ ప్రశ్నలకు ఆప్షన్లు ఇవ్వరు.
ఈ ప్రశ్నలకు సమాధానాలు వర్చువల్ కీ బోర్డును ఉపయోగించి రాయాలి. ఎప్పుడు? ఏ గడువు? * ఆన్లైన్ దరఖాస్తుల తుదిగడువు: అక్టోబరు 4, 2016 * పరీక్ష కేంద్రం మార్చుకోవడానికి గడువు: నవంబర్ 16, 2016 * అడ్మిట్ కార్డు ప్రింట్ తీసుకోవడానికి గడువు: జనవరి 5, 2017 * గేట్ 2017 పరీక్ష తేదీలు: ఫిబ్రవరి 4, 5, 11, 12, 2017 * పరీక్ష ఫలితాల వెల్లడి: మార్చి 27, 2017 * ఈ పరీక్షను 23 పేపర్లలో నిర్వహించనున్నారు.
ఆన్లైన్లో నిర్వహించడం వల్ల ప్రశ్నపత్రాలను వివిధ సెట్లుగా రూపకల్పన చేస్తున్నారు. కాబట్టి అధ్యాయాలతో సహా అన్ని సబ్జెక్టులకూ ప్రాధాన్యమిస్తున్నారు. అభ్యర్థులు ఏ సబ్జెక్టునూ నిర్లక్ష్యం చేయకుండా అన్ని సబ్జెక్టుల్లో ప్రతి అధ్యాయాన్నీ చదవాలి. * గేట్ స్కోరు పీజీ ప్రవేశానికి 3 సంవత్సరాలు, పీఎస్‌యూలకు 1 లేదా 2 సంవత్సరాలు చెల్లుబాటులో ఉంటుంది.
* పూర్తి వివరాలు, సిలబస్ http://gate.iitr.ernet.in/ లో అందుబాటులో ఉంచారు. రెండు విభాగాలు గేట్ ప్రశ్నపత్రం మొత్తం 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలుంటాయి.
* విభాగం-1 (జనరల్ ఆప్టిట్యూడ్): ఇందులో పది ప్రశ్నలుంటాయి. 1-5 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. 6-10 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. ఈ విభాగంలోని 4-5 ప్రశ్నలు ఇంగ్లిష్ సంబంధితం (వెర్బల్ ఎబిలిటీ).
మిగతా ప్రశ్నలు క్వాంటిటేటివ్ సంబంధించినవి ఇవ్వవచ్చు. * విభాగం-2 (సంబంధిత ఇంజినీరింగ్ సబ్జెక్టులు): దీనిలో 55 ప్రశ్నలుంటాయి. * 1-25 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. * 26-55 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు.
* గత సంవత్సరం ప్రశ్నపత్రంలో కామన్ డేటాబేస్డ్ ప్రశ్నలు, లింక్డ్ ప్రశ్నలు ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా ఈ విధమైన ప్రశ్నలు ఇవ్వకపోవచ్చు. * గేట్లో ఒక తప్పు సమాధానానికి 33.33% రుణాత్మక మార్కులుంటాయి. అంటే ఒక మార్కు ప్రశ్నలకు 1/3, రెండు మార్కులవాటికి 2/3 చొప్పున మార్కులు తగ్గిస్తారు.
న్యూమరికల్ ప్రశ్నలకు రుణాత్మక మార్కులుండవు. * ప్రశ్నల సరళి: పరీక్ష పత్రంలో ప్రశ్నలు ఎలా ఉండాలో, ఏ సబ్జెక్టుకు ఎంత ప్రాధాన్యం ఉండాలో ఐఐటీల కోర్ కమిటీ నిర్ణయిస్తుంది. * గత పరీక్షపత్రాల సరళి ప్రకారం.. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచిల్లో..
* 35% ప్రశ్నలు: కామన్ సబ్జెక్టుల్లో ఉంటాయి. * 35% ప్రశ్నలు: సంబంధిత కోర్ సబ్జెక్టుల్లో ఉంటాయి. * గణితం: 10- 15% ప్రశ్నలు. అయితే ఈ విభాగంలోని ప్రశ్నలు శుద్ధ గణితంలా ఉండవు.
ఇంజినీరింగ్ అనువర్తనం (అప్లికేషన్)తో ఉంటాయి. విజయం సాధించాలంటే.. * ఇప్పటినుంచే రోజూ కనీసం 6- 8 గంటలు సాధనకు కేటాయించాలి. ప్రతి వారాంతం, నెలకోసారి చదివిన అంశాలను విశ్లేషించుకోవాలి.
సన్నద్ధతలో పరిమాణం కంటే నాణ్యత ముఖ్యం. * పరీక్షలో ప్రతి ప్రశ్నకూ సరైన సమాధానం రాయడం కష్టం. మూడు గంటల వ్యవధిలో ఎన్ని ప్రశ్నలు, ఏ ప్రశ్నలు రాస్తే ఎన్ని మార్కులు సాధించగలమనేది నిర్ణయించుకోవాలి. * ఆన్లైన్ మోడల్ పేపర్లను తప్పనిసరిగా సాధన చేయాలి.
* తొలిసారి సిద్ధమయేటపుడు ప్రతి చాప్టర్‌కు సంబంధించి ముఖ్య విషయాలను చిన్న చిన్న పట్టికల ద్వారా సంక్షిప్తంగా తయారు చేసుకోవాలి. పరీక్షకు ముందు రోజుల్లో పునశ్చరణకు ఇది చాలా ఉపయోగం. ఆన్లైన్లో... ఐఐఎస్సీ, ఏడు ఐఐటీల్లోని ఏదో ఒక గేట్ జోనల్ వెబ్‌సైట్‌లోని ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ (జీఓఏపీఎస్) ఉపయోగించి దరఖాస్తును ఆన్లైన్లో నింపి రిజిస్టర్ చేసుకోవాలి.
దీనికి సంబంధించిన వెబ్సైట్ http://gate.iitr.ernet.in * అభ్యర్థులు ముందుగా సరైన ఈ-మెయిల్, మొబైల్ నంబర్, జీఓఏపీఎస్ పాస్వర్డ్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒక ఈ-మెయిల్ అడ్రస్ ద్వారా ఒక అభ్యర్థి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుంటుంది. గేట్ ఆఫీస్ నుంచి తరువాతి సమాచారమంతా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ-మెయిల్‌కు పంపుతారు. * దరఖాస్తు చేసుకునేటపుడు తప్పులేవీ లేకుండా చూసుకోవాలి.
లేకపోతే దరఖాస్తును తిరస్కరిస్తారు. * అభ్యర్థులు తమ ఫొటోగ్రాఫ్, సంతకం, సంబంధిత సర్టిఫికెట్లను (పీడీఎఫ్ ఫార్మట్‌లో) దరఖాస్తుతోపాటు తప్పకుండా పంపాలి. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు ఫారం, సర్టిఫికెట్లను ఐఐటీ/ ఐఐఎస్సీ జోనల్గేట్ ఆఫీసులకు పంపవలసిన అవసరం లేదు. * గేట్ 2017 దరఖాస్తు ఫారాలు ఆన్లైన్లో సంబంధిత వెబ్సైట్లో మాత్రమే లభిస్తాయి.
బయట ఎక్కడా అమ్మరు. * అడ్మిట్ కార్డును జోనల్ గేట్ వెబ్సైట్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. పోస్టు ద్వారా అడ్మిట్ కార్డును పంపరు. * పరీక్ష కేంద్రానికి అడ్మిట్ కార్డుతోపాటు ప్రభుత్వం మంజూరు చేసిన వ్యక్తిగత గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
* గేట్ 2017 అభ్యర్థులకు సంబంధించిన పూర్తి వివరాలు గేట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్‌లో మాత్రమే లభిస్తాయి. ఏ సబ్జెక్టుకు ఎన్ని ప్రశ్నలనేది సవాలుగా మారి ఐఐటీ ప్రొఫెసర్లు 2, 3 సబ్జెక్టుల విషయాలను కలిపి ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రతి పేపర్లో వివిధ సబ్జెక్టులను మిళితం చేస్తూ ప్రశ్నలు ఇస్తున్నారు.

EmoticonEmoticon